love languages

ప్రేమ భాషలు – భాగం 1

ప్రేమ భాషలు – భాగం 1 “కొన్ని ప్రేమ కథలు ఎలా మొదలవుతాయి, ఎలా ముగుస్తాయి అన్నది ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు అవి ప్రేమగా మారతాయనే విషయం కూడా వారికి తెలియదు.”

ప్రేమ భాషలు - భాగం 1

“శివ అనే ఒక వ్యక్తి చదువుకోడానికి హైదరాబాద్ వెళ్తాడు. అతను ఒక మెడికల్ స్టూడెంట్. ఇలా కొన్నిరోజులకు ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయి పేరు ప్రియ. రోజూ మాట్లాడుకుంటూ చాలా క్లోజ్ అవుతారు. ఎందుకంటే మనం కొందరి పరిచయంలో, వాళ్లతో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళా లేదా వాళ్ల వల్ల మనం మారిపోతాం. ఇలా షార్ట్ టైమ్‌లోనే నంబర్లు, అడ్రెస్‌లు అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అబ్బాయికి అదే ఫస్ట్ లవ్. అసలు అమ్మాయి మాటలకు చాలా ఎగ్జైట్ అవుతూ, టైం తెలియకుండానే మాట్లాడటం… ఇంక లీనం అయిపోతాడు. అప్పుడు అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు – ‘ఎప్పుడు కనిపిస్తావు?’ అని.”

శివ, ప్రియా ప్రేమకథ

*”అమ్మాయి అంటుంది – ‘ఓకే రా, కలుస్తా’ అని, ఒక అడ్రస్ చెబుతుంది. అప్పుడు శివ అంటాడు – ‘నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 14 కదా “ప్రేమికుల రోజు”, ఆ రోజే కలుస్తా’ అని. కానీ అబ్బాయికి తెలియదు, తాను చేసిన పెద్ద తప్పు ఆ ఒక్క మాటే అని.

లవర్స్ డే దగ్గర పడుతున్న కొద్దీ, ఇద్దరూ మాట్లాడుతూనే ఉంటారు. అకస్మాత్తుగా ఒక రోజు గొడవ పడతారు. లవర్స్ డే రోజున మాత్రం మాట్లాడుకోరు. ఆ తరువాత ఒకరికి ఒకరు సారీ చెప్పుకుని మళ్లీ మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకుంటూనే మళ్లీ కలుద్దామని ఒక రోజు నిర్ణయిస్తారు.

అంతలోనే అబ్బాయికి ఇంటి నుంచి కాల్ వస్తుంది. ఆ సమయానికి శివ కుటుంబ పరిస్థితి బాగోలేదు. శివ రాత్రంతా బాగా ఆలోచిస్తాడు. ‘”ప్రియను కలవకుండానే ఇంతగా అడిక్ట్ అయిపోతే…, ఇక చూసిన తర్వాత ఎక్కువ అడిక్ట్ అయితే…?’ అని రియలైజ్ అవుతాడు. ప్రియకు కాల్ చేసి, ‘మనం ఇంకెప్పుడైనా కలుద్దాం, ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి’ అని అబద్ధం చెబుతాడు. ప్రియ కూడా ‘ఓకే’ అంటుంది.

రోజులు గడుస్తాయి… ఇద్దరూ ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకుంటూ, కాల్స్‌లో మాట్లాడుతూ ఉంటారు. శివ చదువు దాదాపు 90% పూర్తవుతుంది. అప్పుడు ప్రియకు చెప్పి, ‘కలుద్దాం’ అంటాడు. ప్రియ కూడా ‘ఓకే’ అంటుంది కానీ ఈ సారి టైమ్ అడుగుతుంది. ప్రియ ఒక నెల టైమ్ అడిగితే శివ వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత శివ మళ్లీ అడిగితే, ప్రియ మళ్లీ వెయిట్ చేయమంటుంది.

ఎందుకంటే ప్రియ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. అప్పుడు ‘అంత దూరం ఎందుకు వస్తావు, నేనే వస్తా’ అంటుంది.శివ నిజమే కదా అని శివ వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి, ఒక రోజు సీరియస్‌గా అడుగుతాడు – ‘ఏమైంది నీకు? ఇష్టం ఉందా లేదా?’ అని గొడవ పడతారు. అయినా శివ పూర్తిగా ప్రియకు అడిక్ట్ అయిపోయి, ఏమీ అనలేకపోతాడు.

అప్పుడే ప్రియ నుంచి కాల్ వస్తుంది – ‘రేపు మనం మీట్ అవుదాం’ అని శివ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం ప్రియకు కాల్ చేస్తాడు. ఎంతసార్లు కాల్ చేసినా, ప్రియ లిఫ్ట్ చేయదు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రియకు 200 సార్లు కాల్ చేస్తాడు.

“ప్రేమ కోసం విజయవాడ ప్రయాణం” ప్రేమ భాషలు – భాగం 1

ప్రేమ భాషలు - భాగం 1

మధ్యాహ్నం 2:30కి ప్రియ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ‘నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ స్వెల్లింగ్ వచ్చాయి’ అంటుంది. శివ ఒక మెడికో కాబట్టి అతనికి అర్థమవుతుంది. శివ ఏడుపు ఆపుకోలేక, వెంటనే విజయవాడ బస్సులో ఎక్కిపోతాడు. బస్సులో వెళ్తూ అన్ని మెమరీస్ గుర్తుకు తెచ్చుకుంటాడు. ‘అక్కడికి వెళ్తే ఎలా అయినా కలుస్తాను’ అన్న నమ్మకం ఉంటుంది.

6 గంటల ప్రయాణం… జీవితంలో ఫస్ట్ టైమ్ విజయవాడకు వెళ్తున్నాడు. రాత్రి 8కి విజయవాడ రీచ్ అయ్యి, ప్రియకు కాల్ చేస్తాడు. నగరంలో ఎవ్వరూ తెలిసినవాళ్లు లేరు. కానీ సిటీలో లాడ్జీలు ఉంటాయని తెలుసు. ఒక లాడ్జ్‌లోకి వెళ్లి పడుకుంటాడు. ‘నేను ఎందుకు వచ్చాను? నా జీవితంలో ఏమి జరుగుతోంది?’ అని ఆలోచిస్తూ ఒక గంటపాటు నిద్రపోతాడు.

తర్వాత మళ్లీ ప్రియ గురించే ఆలోచనలు. ఉదయం 6 నుంచి 9 వరకు ప్రియకు కాల్స్ చేస్తూ ఉంటాడు. 9 గంటలకు ప్రియ కాల్ లిఫ్ట్ చేస్తుంది. శివ నోట్లోంచి మాటలు రావు. ఏడుస్తూనే మాట్లాడతాడు. ప్రియ నిస్సహాయంగా మాట్లాడగానే, శివకి ఇంకా ఏడుపు వస్తుంది. ప్రియ కూడా ఆటోమేటిక్‌గా ఏడుస్తుంది.

ప్రియ అడుగుతుంది – ‘ఎందుకు వచ్చావు? ఎక్కడ ఉన్నావు?’ కానీ ఆ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేవు, కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే. శివ అంటాడు – ‘నీ కోసమే వచ్చాను’. ప్రియ అంటుంది – ‘నీకు ఇక్కడ ఎవరూ తెలియదు, ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు. దయచేసి వెళ్ళిపో. నేను మా బాబాయి ఇంట్లో ఉన్నాను, ఇప్పుడే హాస్పిటల్‌లో ఉన్నాను. నువ్వు నన్ను కలవలేవు. నువ్వు వెళ్ళు, నేను వచ్చి కలుస్తాను’ అని.

శివ, ప్రియా ప్రేమకథ

శివ ఏం చేయాలో అర్థంకాక, తిరిగి వెళ్ళిపోవడం మంచిదని అనుకుంటాడు. రైల్వే స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోవాలి అని తెలియక, డైరెక్ట్ స్టేషన్ లోపలికి వెళ్తాడు. ‘హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ వస్తే టికెట్ తీసుకుందాం’ అనుకుంటాడు.

బయటికి వస్తుండగా, వెనుక ప్రయాణికులతో పాటు ఒక లేడీ టికెట్ కలెక్టర్ వస్తుంది. కొందరి టికెట్లు చెక్ చేసి, శివ టికెట్ అడుగుతుంది. శివ దగ్గర టికెట్ లేదు. ‘నువ్వు టికెట్ లేకుండా ఇప్పుడే ట్రైన్ నుంచి దిగావు’ అంటుంది. శివ ‘కాదు’ అని చెబుతాడు. ఎంత చెప్పినా వినదు. ‘టికెట్ లేకుండా ప్రయాణం చేశావు, కేసు వేస్తాను’ అంటుంది.

శివ ఎందుకు వచ్చాడో చెప్పలేడు, ఎందుకంటే ప్రియ విషయం చెబితే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుంది. సైలెంట్‌గా ఉంటాడు. చివరికి టీసీ కేసు వేసి, 500 రూపాయల ఫైన్ కట్టిస్తుంది. కానీ హెల్ప్ చేస్తూ – ‘మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ రసీదు చూపించు, వెళ్ళొచ్చు’ అంటుంది.

శివ దానిని నమ్మకపోయినా, రసీదు తీసుకుని బయటకు వస్తాడు. ప్రియకు కాల్ చేస్తాడు. ‘హలో’ అనగానే, పెద్దగా ఏడవడం మొదలుపెడతాడు. ప్రియ కూడా ఫోన్‌లో బాధపడుతుంది. ‘ఎందుకు వచ్చావు? దయచేసి వెళ్ళు. నేను అడ్రెస్ చెబుతాను’ అని, ఒక బస్‌స్టాప్ అడ్రెస్ చెబుతుంది. శివ బస్ ఎక్కి, మళ్లీ బాధలోనే హైదరాబాద్ వస్తాడు.”**

‘ప్రేమ అనేది కనిపించదు, అనుభూతి అవుతుంది’ ప్రేమ భాషలు – భాగం 1

**”శివ హైదరాబాద్‌కి వచ్చి కాలేజ్ హాస్టల్‌లో పడుకుని, ఉదయం ఆలోచిస్తాడు –
‘ఒక అమ్మాయికి ఏమవసరం? నాతో మాట్లాడుకుంటూ, ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఓకే… కానీ నన్ను కలవలేదు. నాతో ఏడుస్తోంది… ఆ కన్నీళ్లు అంత ఈజీగా వస్తాయా? లేక ప్రియా అడుగుతున్నదీ టైమ్‌పాస్ కోసమా?’ అని.
అలా అనుకుంటే, శివకి ఏ కారణాలు కనిపించవు.

అంతలోనే ప్రియా కాల్ చేస్తుంది. ఆ క్షణం నుంచి శివకి ఇంకా విపరీతమైన ప్రేమ మొదలవుతుంది. కాల్‌లో ప్రియా అంటుంది – ‘ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయకు, నేనే వచ్చి కలుస్తా’ అని.
శివకూ చేసేది ఏమీలేక, ప్రియా మాటలు విన్న వెంటనే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒక సమయం వచ్చినప్పుడు కలుద్దాం అనుకుంటాడు.

శివ విజయవాడ వెళ్లడమో లేకపోవడమో తెలియకపోయినా, వాళ్ల ప్రేమ మరింత బలపడుతుంది. రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ, కొన్ని సార్లు రాత్రంతా రెస్ట్ లేకుండా కాల్స్‌లో ఉండేవారు. ఒక అమ్మాయి అంతలా ప్రేమ చూపిస్తే ఎవరికైనా ఎలా ఉంటుందో అలా…

శివ, ప్రియా ప్రేమకథ

మళ్లీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.

టైమ్ అనే దాంట్లో వాళ్లకు లెక్కే ఉండేది కాదు. అప్పుడు శివకి అనిపిస్తుంది – ‘ప్రేమ అనేది కనిపించదు, అనుభూతి అవుతుంది’ అని.”**

“కొన్ని రోజులకు కధ మళ్ళీ మొదలైంది.”. ఎందుకంటే ప్రియపై శివకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. వారి మాటలు కూడా కలిసి పోతున్నాయి. అసలు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, జీవితాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి అన్నీ పూర్తిగా ఆలోచనలో ఉన్నారు.

“కానీ ఒక మాట ఇది అంత నమ్మడానికి ఎలా ఉంటుందో….

ఫోన్‌లో కనీసం ఒకరిని ఒకరు చూడకుండానే ఇంత ప్రేమ, ఇంత బాండింగ్ ఎలా? అర్థం కావడం కష్టం. కానీ వారి ప్రేమ అలా వుంది. మంచి చెడు ఎలా అయినా ఏ రకమైన కథ అయినా ఒక రోజు సక్సెస్ ఆర్ ఫ్లాప్ అవాల్సిందే కదా, కాబట్టి కథలోకి వెళ్ళదాం.

ఒక రోజు ప్రియా శివకు ఒక షర్ట్ పంపిస్తుంది. ఆ షర్ట్ తీసుకోడానికి శివ అక్కడి లోకల్‌లో ఉండలేదు. అందుకే తన దూరపు ఫ్రెండ్‌ని పంపిస్తాడు, అతను ఆ షర్ట్ తీసుకుని వచ్చి శివకి ఇస్తాడు. ఆ షర్ట్ చూసి శివ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్రియా చెప్తుంది – ‘ఆ షర్ట్ వేసుకుని నన్ను కలవడానికి రా’ అని.

శివకి మళ్లీ ప్రియని చూడాలని అనిపిస్తుంది. మళ్లీ అడుగుతాడు – ‘ఎప్పుడూ కలుద్దాం?’ అని. ప్రియా ‘రేపు ఖచ్చితంగా కలుద్దాం’ అని అంటుంది. అప్పుడే శివ జీవితంలో చాలా దూరం ఊహించుకుంటాడు.

తర్వాత రోజు ఉదయాన లేచి ప్రియకు కాల్ చేస్తాడు. కానీ ప్రియా కాల్ లిఫ్ట్ చేయదు. ఫోన్ చేసి చుట్టూ చూస్తూ, చాలా బాధ, కోపం వస్తుంది. ఆ సమయంలో ప్రియ ఇచ్చిన షర్ట్ కాకుండా, సాధారణ షర్ట్ వేసుకుని ప్రియ చెప్పిన అడ్రస్‌కి బయలుదేరతాడు. ఆ అడ్రస్ చివరగా ఆమె సిటీ పేరు చెప్తుంది.

“కరీంనగర్” ప్రేమ భాషలు – భాగం 1

మన శివ మాత్రం బ్లైండ్‌గా వెళ్లిపోతాడు. ప్రియ చెప్పిన అడ్రస్‌కి బస్‌లో వెళ్తాడు. బస్ ఎక్కి ఆమె చెప్పిన సిటీకి చేరుతాడు. ఆ సిటీ పేరు కరీంనగర్.

కరీంనగర్‌కు చేరి ప్రియా చదివే కాలేజీకి వెళ్తాడు. ఎందుకంటే ప్రియా ముందు రోజూ చెబుతుంది, ‘నేను కాలేజీలో ఉంటాను’ అని. కానీ ప్రియా కాల్ లిఫ్ట్ చేయదు. శివ కాల్ చేస్తూ ఉంటూ వెళ్తున్నాడు. ‘నన్ను చూసి అయినా వస్తుందేమో’ అని ఆశతో ఉంటుంది.

“శివ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో తన నిజమైన ఫోటో ఉంటుంది.”

ఇలా ఎక్కువగా వేచి, రాత్రి 9 గంటల వరకు కాలేజ్ బస్సు స్టాప్ వద్ద ఉన్నాడు. ఏమి చేయాలో తెలియదు. 9:15 నాడు ఆమె నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే శివ కరీంనగర్ వచ్చినట్లు చెప్తాడు శివని తిడుతుంది.

ఎందుకంటే తనకు చెప్పకుండా కరీంనగర్ వచ్చాడని. ప్రియా ఎలా అంటే – ‘నా కోసమా? చాలా మంది తిరిగారు. నీవు కూడా వాళ్లలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నావు’ అని.

అప్పుడు శివకు కన్నీళ్లు వస్తాయి. శివ ఎంత ఏడ్చినా, తిట్టి కాల్ కట్ చేస్తుంది. శివ ముఖాన్ని తుడుచుకోడానికి మొదటిసారి కుర్చీఫ్ కొంటాడు కాని దాన్ని కన్నీళ్లు తుడుచుకోవడానికి ఉపయోగిస్తాడు.

ప్రియకు మళ్లీ కాల్ చేస్తాడు – ‘ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?’ అని ఏడుస్తూ అడుగుతాడు.

ప్రియా ఒకొక్క మాట అంటుంది. అది ఏమిటంటే – ‘నాకు రాత్రి మళ్లీ ఫీవర్ వచ్చింది. ఎందుకో పూర్తిగా హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నా, డాక్టర్ Cancer అని చెప్పారు. అసలు నాకు ఇది ఎలా, ఎందుకు జరిగిందో తెలియడం లేదు. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? నేను ఏమి చేయాలి? దయచేసి నన్ను మరచిపో.

శివా, ఏడుస్తూ కూర్చుంటాడు

శివ మన అదృష్టం ఏమిటంటే – మనం కలవలేదు. నువ్వు నన్ను మరచిపోవడం విలవుతుంది. కానీ మనం ముందే కలిసితే, నువ్వు తట్టుకునేవాడివి కాదని నాకు తెలుసు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో కూడా తెలుసు. దయచేసి నన్ను మరచిపొయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు. నా కోసం నీ జీవితం వృథా చేయడంలో నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంటికి వెళ్ళు బంగారం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు శివకి అనిపిస్తుంది – జీవితంలో ఇదికన్నా ఎక్కువ బాధ ఏమీ ఉండదు.”**

“నిజంగా మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకు వస్తే నరకం ప్రేమ భాషలు – భాగం 1

“శివ ఆ నరకానికి దగ్గరగా ఉన్నాడు, మిగతదీ తర్వాతి భాగంలో చెప్తాను.”

“ఈ కథ చదవినందుకు కృతజ్ఞతలు………మీ లియోనో అజిత్.”

ఇంకా చదవండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *